కీర్తనలు 102: 4
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడిపోయియున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవుచున్నాను."
సంబంధిత రిఫరెన్స్‌లు
భక్తిహీనులు నశించిపోవుదురు యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు.
నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు.
రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.
నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది.
నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొనియున్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసియున్నావు.
నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించుచున్నవి నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా యెముకలు క్షీణించుచున్నవి.
నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు.
నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను. నా స్వరమండలము దుఃఖస్వరము నిచ్చుచున్నది నా పిల్లనగ్రోవి రోదనశబ్దము ఎత్తుచున్నది.
పరమునుండి ఆయన నా యెముకలమీదికి అగ్ని ప్రయోగించియున్నాడు అది యెడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కుపరచుటకైవలనొగ్గియున్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను పాడుచేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్లజేసియున్నాడు.
ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు
నాచేత బలాత్కారము జరుగకపోయినను నా ప్రార్థన యథార్థముగా నుండినను
నా యెముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొనియున్నవి దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడియున్నది
వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచుకొని వచ్చును
నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొనిపోవుచున్నది.
నా యెముకలన్నియు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు
యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము విచారమువలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి.
నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.
దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా.)
అప్పుడు యెహోవా నీవంటివాడెవడు? మించిన బలముగలవారి చేతినుండి దీనులను దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును.
నా గుండె నాలో వేదన పడుచున్నది మరణభయము నాలో పుట్టుచున్నది
దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును
దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా.)
నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలె నేను వాడియున్నాను.
కావున నా ఆత్మ నాలో క్రుంగియున్నది నాలో నా హృదయము విస్మయమొందెను.
సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.
నిన్ను చూచి యే మనిషి రూపముకంటె అతని ముఖమును, నర రూపముకంటె అతని రూపమును చాల వికారమని చాలమంది యేలాగు విస్మయమొందిరొ
అట్టివారి ఆకారము బొగ్గుకంటె నలుపాయెను వారిని వీధులలో చూచువారు వారిని గురుతు పట్టజాలరు. వారి చర్మము వారి యెముకలకు అంటుకొనియున్నది అది యెండి కఱ్ఱవంటిదాయెను.