కీర్తనలు 104: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచియున్నావు. "
సంబంధిత రిఫరెన్స్‌లు
పాపులు భూమిమీదనుండి లయమగుదురు గాక భక్తిహీనులు ఇక నుండకపోదురు గాక నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము యెహోవాను స్తుతించుడి.
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము
యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వ కార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము.
యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను నన్ను తరుమువారి చేతిలోనుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా
నేను నా దేవుడైన యెహోవా యెదుట ప్రార్థన చేసి యొప్పుకొన్నదేమనగా ప్రభువా, మాహాత్మ్యము గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారియెడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా,
యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణము నొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయదుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి.
యెహోవా మహాత్మ్యము గలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది
యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.
యెహోవా, ప్రభువా సైన్యములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధికబలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు.
నీవు వేవేలమందికి కృపచూపుచు, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు.
ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలనుబట్టియు వారి క్రియాఫలమునుబట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు.
తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొనియుండెను.
ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలవలె ఉండెను;
ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమైయుండెను; ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.
ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొనియుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.
నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదములయొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను భయపడకుము;
నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని,
అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములనుగూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు
యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టుకొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది.
నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను
ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమమువలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్రములు అగ్నివలె ఉండెను.
దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి
యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి.
యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలములమీద యెహోవా సంచరించుచున్నాడు.
యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది.
ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలసౌందర్యములు ఆయన పరిశుద్ధస్థలములో ఉన్నవి.
యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొనియున్నావు.
ఉత్తరదిక్కున సువర్ణప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకొనియున్నాడు.
గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా?
ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము గౌరవ ప్రభావములను ధరించుకొనుము.
శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము.
నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయనవలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది.
యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి.
నీ యాజకులు నీతిని వస్త్రమువలె ధరించుకొందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక.
మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను
యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము
రాజు బబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను.
అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను; లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువచేయలేడు.
మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా.