లేఖనాలను అన్వేషించండి

కీర్తనలు 109: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాటలాడువారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతికారము. "

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 109:18

తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది

కీర్తనలు 109:29

నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక తమ సిగ్గునే నిలువుటంగీవలె కప్పుకొందురు గాక

కీర్తనలు 35:26

నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవమానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక

కీర్తనలు 132:18

అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదను అతని కిరీటము అతనిమీదనే యుండి తేజరిల్లును అనెను.

యిర్మియా 24:9

మరియు వారు యిటు అటు చెదరగొట్టబడుటకై భూ రాజ్యములన్నిటిలోను, నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోను, వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదను.

యిర్మియా 43:12

ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను, వాటిని నెబుకద్రెజరు కాల్చివేయును, ఆ దేవతలను చెరగొనిపోవును, గొఱ్ఱలకాపరి తన వస్త్రమును చుట్టుకొనునట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడనుండి సాగిపోవును.