కీర్తనలు 115: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు"
సంబంధిత రిఫరెన్స్‌లు
నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను.
నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచుచున్నారు.
వారి దేవుడెక్కడనున్నాడని అన్యజనులు పలుకనేల? మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమునుగూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము.
ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమిమీదనుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొనిపోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్నినుండి మళ్లుకొని నీవు
కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపినయెడల నీ కీర్తినిగూర్చి వినిన జనములు
ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు.
వారిని దూరమునకు చెదరగొట్టెదను వారి పేరు మనుష్యులలో లేకుండ చేసెదననుకొందును వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో
ఇదంతయు యెహోవా చేసినది కాదు మా బలముచేత వారిని గెలిచితివిు అని వారనుకొందురేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు.
యూదా రాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.
ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా నీవు మాత్రము తప్పించుకొందువా?
నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారు గాని హారాను వారు గాని, రెజెపులు గాని, తెలశ్శారులో నుండిన ఏదెనీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?
హమాతు రాజు ఏమాయెను? అర్పాదు రాజును సెపర్వియీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి?
హిజ్కియా దూతలచేతిలోనుండి ఆ ఉత్తరము తీసికొని చదివి, యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి
యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవైయున్నావు.
యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినవాని మాటలను చెవిని బెట్టుము.
యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి
వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి.
యెహోవా మా దేవా; లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలిసికొనునట్లుగా అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము.
యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా, నీ జనులయెడల జాలి చేసికొని, అన్యజనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకప్పగింపకుము; లేనియెడల అన్యజనులు వారి దేవుడు ఏమాయెనందురుగదా యని వేడుకొనవలెను.
ఏలయనగా నీవు ఏ దేశములోనుండి మమ్మును రప్పించితివో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవుటవలనను, వారిని ద్వేషించుటవలనను, అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించెనని చెప్పుకొందురేమో.
అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చి నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి యుండుము, ఏడాదినాటికి సిరియారాజు నీమీదికి మరల వచ్చునని అతనితో చెప్పెను.
ఒంటిమీదినుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టి ఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను.
జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి.
దేవా, సీయోనులో మౌనముగానుండుట నీకు స్తుతిచెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసియున్నది.
యెహోవా మహా ఘనత నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను.
ఆ యా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలోనుండి విడిపించెనా? హమాతు దేవతలేమాయెను?
కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీచేత దూషణనొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవుదానిని చేయుదును.
ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, యీ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే; నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.
నా శత్రువు దాని చూచును. నీ దేవుడైన యెహోవా యెక్కడనని నాతో అనినది అవమానము నొందును, అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురదవలె త్రొక్కబడును.