కీర్తనలు 147: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచియున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి అహరోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి
లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి యెహోవాయందు భయభక్తులు గలవారలారా, యెహోవాను సన్నుతించుడి.
యెరూషలేములో నివసించు యెహోవా సీయోనులోనుండి సన్నుతింపబడును గాక యెహోవాను స్తుతించుడి.
యెహోవా నిరంతరము ఏలును సీయోనూ, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును
ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతో షించుదురు గాక సీయోను జనులు తమ రాజునుబట్టి ఆనందించుదురు గాక.
సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడైయున్నాడు.
సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.
సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి; తన నీతినిబట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రిహించును
దేవుడు సీయోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును.
దూరస్థులారా, ఆలకించుడి నేను చేసినదాని చూడుడి సమీపస్థులారా, నా పరాక్రమమును తెలిసికొనుడి.
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.