కీర్తనలు 31: 1
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము."
సంబంధిత రిఫరెన్స్‌లు
మా పితరులు నీయందు నమ్మికయుంచిరి వారు నీయందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి.
వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదలనొందిరి నీయందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి.
నా దేవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింపనియ్యకుము
యెహోవా, నేను నీ శరణుజొచ్చియున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము.
నీ నీతినిబట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము.
రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు.
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.
ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.
యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతనుబట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము.
హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా,
దేవా, నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యెమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారిచేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.
యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపములకు చెవియొగ్గుము నీ విశ్వాస్యతనుబట్టియు నీ నీతినిబట్టియు నాకు ఉత్తరమిమ్ము.
యెహోవా, నీ నామమునుబట్టి నన్ను బ్రదికింపుము నీ నీతినిబట్టి నా ప్రాణమును శ్రమలోనుండి తప్పింపుము.
నేను నీ సేవకుడను నీ కృపనుబట్టి నా శత్రువులను సంహరింపుము నా ప్రాణమును బాధపరచువారినందరిని నశింపజేయుము.
ప్రభువా, మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు, యెరూషలేము నీ జనులచుట్టు నున్న సకల ప్రజల యెదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యములన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను.
యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను నన్ను తరుమువారి చేతిలోనుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా
నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను.
యెహోవా, నీకు మొఱ్ఱపెట్టియున్నాను నన్ను సిగ్గు నొందనియ్యకుము భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక; పాతాళమునందు వారు మౌనులై యుందురు గాక.
నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షింపుము.