లేఖనాలను అన్వేషించండి

కీర్తనలు 35: 23

క్రాస్-రిఫరెన్స్‌లు

" నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యెమాడుటకు లెమ్ము. "

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 7:6

యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.

కీర్తనలు 44:23

ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.

కీర్తనలు 80:2

ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి యెదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింప రమ్ము.

యెషయా 51:9

యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగుకొమ్ము పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా?

కీర్తనలు 89:26

నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును.

కీర్తనలు 142:5

యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమిమీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని.

యోహాను 20:28

అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.

ఆదికాండము 16:5

అప్పుడు శారయి నా ఉసురు నీకు తగులును; నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలిసికొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైనదాననైతిని; నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను

కీర్తనలు 3:7

యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవు నీవే.

కీర్తనలు 59:4

నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము.

కీర్తనలు 109:1

నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము

యెషయా 10:26

ఓరేబు బండయొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకధిపతియగు యెహోవా తన కొరడాలను వానిమీద ఆడించును. ఆయన దండము సముద్రమువరకు వచ్చును ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దానినెత్తును.

విలాపవాక్యములు 3:59

యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచియున్నావు నా వ్యాజ్యెము తీర్చుము.