లేఖనాలను అన్వేషించండి

కీర్తనలు 54: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" దేవా, నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 5:1

యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము.

కీర్తనలు 5:2

నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను.

కీర్తనలు 5:3

యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.

కీర్తనలు 13:3

యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము

కీర్తనలు 55:1

దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.

కీర్తనలు 55:2

నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము.

కీర్తనలు 130:2

ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము.

కీర్తనలు 143:7

యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము