లేఖనాలను అన్వేషించండి

కీర్తనలు 59: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" పాపము చేయువారి చేతిలోనుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలోనుండి నన్ను రక్షింపుము."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 26:9

పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము.

కీర్తనలు 27:2

నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లికూలిరి

కీర్తనలు 55:23

దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమ్మికయుంచియున్నాను.

కీర్తనలు 139:19

దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు నరహంతకులారా, నాయొద్దనుండి తొలగిపోవుడి.

ఆదికాండము 32:11

నా సహోదరుడైన ఏశావుచేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.

2సమూయేలు 22:17

ఉన్నతస్థలములనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.

కీర్తనలు 18:48

ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్నుహెచ్చించుదువు బలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు

కీర్తనలు 25:3

నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు.

కీర్తనలు 71:4

నా దేవా, భక్తిహీనులచేతిలోనుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులోనుండి బలాత్కారుని పట్టులోనుండి నన్ను విడిపింపుము.

హోషేయ 6:8

గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి.

హబక్కూకు 1:4

అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది.