లేఖనాలను అన్వేషించండి

కీర్తనలు 66: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొఱ్ఱలను తీసికొని నీకు దహనబలులు అర్పించెదను. ఎద్దులను పోతుమేకలను అర్పించెదను.(సెలా)."

సంబంధిత రిఫరెన్స్‌లు

యిర్మియా 41:5

గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరచుకొనిన యెనుబదిమంది పురుషులు యెహోవా మందిరమునకు తీసికొనిపోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షెకెమునుండియు షిలోహునుండియు షోమ్రోనునుండియు రాగా

2సమూయేలు 6:13

ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి యడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను,

2సమూయేలు 6:17

వారు యెహోవా మందసమును తీసికొనివచ్చి గుడారము మధ్యను దావీదు దానికొరకు ఏర్పరచిన స్థలమున నుంచగా, దావీదు దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించెను.

2సమూయేలు 6:18

దహనబలులను సమాధానబలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి,

2సమూయేలు 6:19

సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులగు స్త్రీ పురుషులకందరికి ఒక్కొక రొట్టెయు ఒక్కొక భక్ష్యమును ఒక్కొక ద్రాక్షపండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరును తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి.

1దినవృత్తాంతములు 16:1

ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసికొనివచ్చి, దావీదు దానికొరకు వేయించియున్న గుడారము నడుమను దాని ఉంచి, దేవుని సన్నిధిని దహనబలులను సమాధానబలులను అర్పించిరి.

1దినవృత్తాంతములు 16:2

దహనబలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి

1దినవృత్తాంతములు 16:3

పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్షపండ్ల అడను పంచిపెట్టెను.

లేవీయకాండము 1:9

అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠముమీద దహింపవలెను.

సంఖ్యాకాండము 7:32

ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును

సంఖ్యాకాండము 7:45

దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను