కీర్తనలు 85: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవినిబెట్టెదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక."
సంబంధిత రిఫరెన్స్‌లు
స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.
దీర్ఘాయువుచేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను.
మరియు అతడు మీయెడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీయెడల నేనతనికి జాలి పుట్టించెదను.
ఆ మనుష్యుడు మీ యితర సహోదరుని బెన్యామీనును మీ కప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని యెదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీనుడనై యుండవలసినయెడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను.
యెహోవా, నీ రక్షణ కొరకు కనిపెట్టియున్నాను.
ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు.