లేఖనాలను అన్వేషించండి

కీర్తనలు 88: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా?(సెలా.)"

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 38:10

నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను.

కీర్తనలు 42:3

నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను.

కీర్తనలు 102:9

నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను.

యోబు 16:20

నా స్నేహితులు నన్ను ఎగతాళిచేయుచున్నారు. నరుని విషయమై యొకడు దేవునితో వ్యాజ్యెమాడవలెననియు

యోబు 17:7

నా కనుదృష్టి దుఃఖముచేత మందమాయెను నా అవయవములన్నియు నీడవలె ఆయెను

విలాపవాక్యములు 3:48

నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది.

విలాపవాక్యములు 3:49

యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచువరకు

యోహాను 11:35

యేసు కన్నీళ్లు విడిచెను.

కీర్తనలు 88:1

యెహోవా, నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొఱ్ఱపెట్టునాడు

కీర్తనలు 55:17

సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును

కీర్తనలు 86:3

ప్రభువా, దినమెల్ల నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నన్ను కరుణింపుము

కీర్తనలు 44:20

మా దేవుని నామమును మేము మరచియున్నయెడల అన్యదేవతలతట్టు మాచేతులు చాపియున్నయెడల

కీర్తనలు 68:31

ఐగుప్తులోనుండి ప్రధానులు వచ్చెదరు కూషీయులు దేవునితట్టు తమచేతులు చాచుకొని పరుగెత్తివచ్చెదరు.

కీర్తనలు 143:6

నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమివలె నా ప్రాణము నీకొరకు ఆశపడుచున్నది.

యెహెజ్కేలు 17:11

మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

యోబు 11:13

నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయెడల నీచేతులు ఆయనవైపు చాపినయెడల

కీర్తనలు 6:6

నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొనిపోవుచున్నది.

కీర్తనలు 6:7

విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.

కీర్తనలు 31:9

యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము విచారమువలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి.

కీర్తనలు 38:6

నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను.

కీర్తనలు 42:9

కావున నీవేల నన్ను మరచియున్నావు? శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను.