లేఖనాలను అన్వేషించండి

కీర్తనలు 89: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 89:10

చంపబడినదానితో సమానముగా నీవు రహబును, ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలముచేత నీ శత్రువులను చెదరగొట్టితివి.

కీర్తనలు 62:11

బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను.

దానియేలు 4:34

ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరల మానవబుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశముతట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించితిని; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి.

దానియేలు 4:35

భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేన యెడలను భూనివాసుల యెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు.

మత్తయి 6:13

మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.

నిర్గమకాండము 6:1

అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు; బలమైన హస్తముచేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తముచేతనే అతడు తన దేశములోనుండి వారిని తోలివేయునని మోషేతో అనెను

నిర్గమకాండము 13:9

యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను బయటికి రప్పించెననుటకు, ఈ ఆచారము నీ చేతిమీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును.

యెహోషువ 4:24

మీరు ఎల్లప్పుడును మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటువరకు మీ దేవుడైన యెహోవా తానే మాయెదుట ఎఱ్ఱసముద్రమును ఎండచేసినట్లు మీరు దాటువరకు మీ యెదుట యొర్దాను నీళ్ళను ఎండచేసెనని చెప్పి యీ సంగతి వారికి తెలియపరచవలెను.

1రాజులు 8:42

నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమును గూర్చియు, నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి యీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినయెడల

2దినవృత్తాంతములు 6:32

మరియు నీ జనులైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమునుగూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, చాచిన చేతులనుగూర్చియు వినినవారై, దూరదేశమునుండి వచ్చి ఈ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసినపుడు

యోబు 30:21

నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు

యోబు 40:9

దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింపగలవా?

కీర్తనలు 18:48

ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్నుహెచ్చించుదువు బలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు

కీర్తనలు 89:8

యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు.

కీర్తనలు 89:21

నా చెయ్యి యెడతెగక అతనికి తోడైయుండును నా బాహుబలము అతని బలపరచును.

కీర్తనలు 118:15

నీతిమంతుల గుడారములలో రక్షణనుగూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును.

యెషయా 41:10

నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.

లూకా 1:51

ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను.

1పేతురు 5:6

దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైనచేతిక్రింద దీనమనస్కులై యుండుడి.