కీర్తనలు 92: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీతిమంతులు ఖర్జూర వృక్షమువలె మొవ్వు వేయుదురు లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు"
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.
ఆపదలన్నిటిలోనుండి ఆయన నన్ను విడిపించియున్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది.
నా దేవుడు తన కృపలో నన్ను కలిసికొనెను నాకొరకు పొంచియున్నవారికి సంభవించినదానిని దేవుడు నాకు చూపించును.
నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును
వాని మనస్సు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరువరకు వాడు భయపడడు.
మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆ యా సంస్థానములలోని జనులకందరికి పంపించవలెననియు, యూదులు తమ శత్రువులమీద పగతీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలెననియు ఆజ్ఞ ఇయ్యబడెను.
అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు.
వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును.
యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియైయున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను.
దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులార చూచెదరు.
నీవు వెళ్లి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మేలు చేయుటకైకాక కీడుచేయుటకై నేను ఈ పట్టణమునుగూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను; నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును.
నీ సహోదరుని శ్రమానుభవదినము చూచి నీవు ఆనందమొంద తగదు; యూదావారి నాశనదినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు;