కీర్తనలు 96: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి.
యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయననుగూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది.
యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.
సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి.
అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి.
యెహోవా మహా ఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొందతగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.
జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు.
ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.
జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి.
యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములుచేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి.
భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడది స్థిరపరచబడును.
యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక
సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక పొలములును వాటియందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు.
భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సయించును.
ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆ యా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవుని కొరకు మనుష్యులను కొని,
వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దల యెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగు వేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు.(సెలా.)
జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక
దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక.
అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.
భూరాజ్యములారా, దేవునిగూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి.(సెలా.)
మరియు సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పియున్నది.
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి.
ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన అద్భుత క్రియలన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి.
సీయోను వాసియైన యెహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి.
యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.
దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి.
సర్వలోక నివాసులారా, దేవునిగూర్చి సంతోషగీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి
సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమునుబట్టి నిన్ను కీర్తించును.(సెలా.)
రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయుదము
ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్యకార్యము లన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి
యెహోవాను స్తుతించుడి యెహోవా నామమును స్తుతించుడి యెహోవా సేవకులారా,
సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యాకోబునుబట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమునుబట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి స్తుతి చేయుడి యెహోవా, ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమీ అని బతిమాలుడి.
నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన
అన్యజనులును దేవుని వాక్యమంగీకరించిరని అపొస్తలులును యూదయ యందంతటనున్న సహోదరులును వినిరి.
ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.
ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణ కరమైన దేవుని కృప ప్రత్యక్షమై