లేఖనాలను అన్వేషించండి

రోమీయులకు 14: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" దేవుని రాజ్యము భోజనమును పానమును కాదుగాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది."

సంబంధిత రిఫరెన్స్‌లు

రోమీయులకు 12:17

కీడుకు ప్రతికీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి.

1కొరిందీయులకు 10:29

మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షినిబట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల?

1కొరిందీయులకు 10:30

నేను కృతజ్ఞతతో పుచ్చుకొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేల?

2కొరిందీయులకు 8:20

మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై యున్నాము గనుక దానినిగూర్చి మామీద ఎవడును తప్పు మోపకుండ మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము.

2కొరిందీయులకు 8:21

ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును యోగ్యమైన వాటినిగూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.

1దెస్సలోనీకయులకు 5:22

ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.

ఎఫెసీయులకు 5:2

క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.