లేఖనాలను అన్వేషించండి

రోమీయులకు 5: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరియెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

రోమీయులకు 5:17

మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకనిద్వారానే యేలినయెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవముగలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు.

రోమీయులకు 5:21

ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.

ఆదికాండము 4:8

కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీదపడి అతనిని చంపెను.

ఆదికాండము 5:5

ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 5:6

షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.

ఆదికాండము 5:7

ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:8

షేతు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 5:9

ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.

ఆదికాండము 5:10

కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిదివందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:11

ఎనోషు దినములన్నియు తొమ్మిదివందల అయిదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 5:12

కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.

ఆదికాండము 5:13

మహలలేలును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:14

కేయినాను దినములన్నియు తొమ్మిదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 5:15

మహలలేలు అరువది యైదేండ్లు బ్రదికి యెరెదును కనెను.

ఆదికాండము 5:16

యెరెదును కనిన తరువాత మహలలేలు ఎనిమిదివందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:17

మహలలేలు దినములన్నియు ఎనిమిదివందల తొంబదియైదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 5:18

యెరెదు నూటఅరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను.

ఆదికాండము 5:19

హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిదివందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:20

యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువది రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 5:21

హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.

ఆదికాండము 5:22

హనోకు మెతూషెలను కనిన తరువాత మూడువందల యేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:23

హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.

ఆదికాండము 5:24

హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.

ఆదికాండము 5:25

మెతూషెల నూటఎనుబది యేడేండ్లు బ్రదికి లెమెకును కనెను.

ఆదికాండము 5:26

మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడువందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:27

మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 5:28

లెమెకు నూటఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని

ఆదికాండము 5:29

భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మనచేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను

ఆదికాండము 5:30

లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:31

లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 7:22

పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను.

ఆదికాండము 19:25

ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించినవారినందరిని నేలమొలకలను నాశనము చేసెను.

నిర్గమకాండము 1:6

యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరము వారందరును చనిపోయిరి.

హెబ్రీయులకు 9:27

మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.

రోమీయులకు 8:20

ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై,

రోమీయులకు 8:22

సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నదని యెరుగుదుము.

నిర్గమకాండము 1:22

అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రదుకనియ్యుడి అని తన జనులందరికి ఆజ్ఞాపించెను.

నిర్గమకాండము 12:29

అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరిని పశువుల తొలి పిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను

నిర్గమకాండము 12:30

ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహా ఘోష పుట్టెను.

యోనా 4:11

అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను.

రోమీయులకు 6:9

మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని నమ్ముచున్నాము.

1కొరిందీయులకు 10:6

వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.

1కొరిందీయులకు 15:55

ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?

హెబ్రీయులకు 9:9

ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి.

హెబ్రీయులకు 11:19

తన యేకకుమారుని అర్పించి, ఉపమాన రూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.

1పేతురు 3:21

దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.