లేఖనాలను అన్వేషించండి

రోమీయులకు 9: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడియున్నది."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 25:22

ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను

ఆదికాండము 25:23

రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.

2సమూయేలు 8:14

మరియు ఎదోము దేశమందు అతడు దండునుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతట అతడు కావలిదండుంచెను; దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.

1రాజులు 22:47

ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను; ప్రధానియైన యొకడు రాజ్యపాలనము చేయుచుండెను.

ఆదికాండము 27:23

యాకోబుచేతులు అతని అన్నయైన ఏశావుచేతులవలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గురుతు పట్టలేక అతనిని దీవించి

ఆదికాండము 27:29

జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక