లేఖనాలను అన్వేషించండి

పరమగీతము 2: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆలకించుడి; నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులువేయుచు కొండలమీదను ఎగసిదాటుచు మెట్టలమీదను అతడు వచ్చుచున్నాడు."

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 26:63

అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు నీవన్నట్టే.

సామెతలు 5:19

ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందుచుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.

ఎఫెసీయులకు 5:22

స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి.

ఎఫెసీయులకు 5:23

క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.

ఎఫెసీయులకు 5:24

సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.

ఎఫెసీయులకు 5:25

పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,

ఎఫెసీయులకు 5:26

అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

ఎఫెసీయులకు 5:27

నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.

ఎఫెసీయులకు 5:28

అటువలెనే పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై యున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.

ఎఫెసీయులకు 5:29

తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును.

ఎఫెసీయులకు 5:30

మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.

ఎఫెసీయులకు 5:31

ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.

ఎఫెసీయులకు 5:32

ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.

ఎఫెసీయులకు 5:33

మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.

కీర్తనలు 45:14

విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసికొనిరాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీయొద్దకు తీసికొనిరాబడుచున్నారు.

కీర్తనలు 48:11

నీ న్యాయవిధులనుబట్టి సీయోను పర్వతము సంతోషించునుగాక యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక.

ప్రసంగి 3:5

రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగలించుటకు కౌగలించుట మానుటకు;

లూకా 5:34

అందుకు యేసు పెండ్లికుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటివారిచేత మీరు ఉపవాసము చేయింపగలరా?

లూకా 23:28

యేసు వారివైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.