Logo

2సమూయేలు అధ్యాయము 2 వచనము 14

2సమూయేలు 2:17 తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలువారును దావీదు సేవకుల యెదుట నిలువలేక పారిపోయిరి.

2సమూయేలు 2:26 అబ్నేరు కేకవేసి కత్తి చిరకాలము భక్షించునా? అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీవెరుగుదువు గదా; తమ సహోదరులను తరుమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక యుందువని యోవాబుతో అనెను.

2సమూయేలు 2:27 అందుకు యోవాబు దేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక యుండినయెడల జనులందరు తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగిపోయి యుందురని చెప్పి

సామెతలు 10:23 చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే.

సామెతలు 17:14 కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు

సామెతలు 20:18 ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము.

సామెతలు 25:8 ఆలోచన లేక వ్యాజ్యెమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచిదాని అంతమున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో.

సామెతలు 26:18 తెగులు అమ్ములు కొరవులు విసరు వెఱ్ఱివాడు

సామెతలు 26:19 తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు.

న్యాయాధిపతులు 9:29 ఈ జనము నాచేతిలో ఉండినయెడల ఆహా నేను అబీమెలెకును తొలగింతును గదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను.

1సమూయేలు 14:12 యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీయులచేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయువానితో చెప్పి

2రాజులు 14:8 అంతట అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి మనము ఒకరినొకరము దర్శించునట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా

2దినవృత్తాంతములు 25:17 అప్పుడు యూదారాజైన అమజ్యా ఆలోచన చేసికొని రమ్ము మనము ఒకరి ముఖమును ఒకరము చూచుకొందమని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోయాషునొద్దకు వర్తమానము పంపెను.