Logo

2సమూయేలు అధ్యాయము 9 వచనము 6

1దినవృత్తాంతములు 8:34 యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.

1దినవృత్తాంతములు 9:40 యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.

ఆదికాండము 18:2 అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి

ఆదికాండము 33:3 తాను వారిముందర వెళ్లుచు తన సహోదరుని సమీపించువరకు ఏడుమార్లు నేలను సాగిలపడెను.

1సమూయేలు 20:41 వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కునుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను.

1సమూయేలు 25:23 అబీగయీలు దావీదును కనుగొని, గార్దభముమీదనుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారముచేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను

1సమూయేలు 22:12 సౌలు అహీటూబు కుమారుడా, ఆలకించుమనగా అతడు చిత్తము నా యేలినవాడా అనెను.

2సమూయేలు 1:7 అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా యేలినవాడా అని నేనంటిని.

2సమూయేలు 19:24 మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును నెదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగివచ్చిన నాటివరకు అతడు కాళ్లు కడుగుకొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకుకొనకయు నుండెను.

1రాజులు 1:31 బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారము చేసి నా యేలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రదుకును గాక అనెను.