Logo

2సమూయేలు అధ్యాయము 24 వచనము 25

ఆదికాండము 8:20 అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.

ఆదికాండము 22:9 ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.

1సమూయేలు 7:9 సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగబలిగా అర్పించి, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను.

1సమూయేలు 7:17 మరియు అతని యిల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగివచ్చి అచ్చటకూడను న్యాయము తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను.

2సమూయేలు 24:14 అందుకు దావీదు నా కేమియు తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యతగలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండ యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను.

2సమూయేలు 21:14 సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధియందు పాతిపెట్టిరి. రాజు ఈలాగు చేసిన తరువాత దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడంగీకరించెను.

1దినవృత్తాంతములు 21:26 పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి. దహనబలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆకాశములోనుండి దహనబలిపీఠము మీదికి అగ్నివలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను.

1దినవృత్తాంతములు 21:27 యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో వేసెను.

విలాపవాక్యములు 3:32 ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును.

విలాపవాక్యములు 3:33 హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు.

లేవీయకాండము 17:8 మరియు నీవు వారితో ఇట్లనుము ఇశ్రాయేలీయుల కుటుంబములలోగాని మీలో నివసించు పరదేశులలోగాని ఒకడు దహనబలినైనను వేరొక యే బలినైనను

సంఖ్యాకాండము 16:48 అతడు చచ్చినవారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను.

సంఖ్యాకాండము 25:8 సమాజమునుండి లేచి, యీటెను చేతపట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవునట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచిపోయెను.

న్యాయాధిపతులు 21:4 మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహనబలులను సమాధానబలులను అర్పించిరి.

1సమూయేలు 6:14 ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతిదగ్గర నిలువగా, వారు బండి యొక్క కఱ్ఱలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి.

1దినవృత్తాంతములు 21:25 ఆ భూమికి ఆరువందల తులముల బంగారమును అతనికిచ్చెను.