Logo

జెఫన్యా అధ్యాయము 1 వచనము 10

1సమూయేలు 5:5 కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటివరకు ఎవరును అష్డోదులో దాగోనుయొక్క గుడిగడపను త్రొక్కుటలేదు.

1సమూయేలు 2:15 ఇదియు గాక వారు క్రొవ్వును దహింపకమునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితోయాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీయొద్ద తీసికొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచువచ్చెను.

1సమూయేలు 2:16 ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సు వచ్చినంతమట్టుకు తీసికొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పినయెడల వాడు ఆలాగువద్దు ఇప్పుడే యియ్యవలెను, లేనియెడల బలవంతముచేత తీసికొందుననును.

2రాజులు 5:20 అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన యీ నయమాను తీసికొనివచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని, యెహోవా జీవముతోడు నేను పరుగెత్తికొనిపోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైనను తీసికొందుననుకొని

2రాజులు 5:21 నయమానును కలిసికొనుటకై పోవుచుండగా, నయమాను తన వెనుకనుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథముమీదనుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి

2రాజులు 5:22 నా యజమానుడు నాచేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యౌవనులు ఎఫ్రాయిము మన్యమునుండి నాయొద్దకు ఇప్పుడే వచ్చిరిగనుక నీవు వారికొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను.

2రాజులు 5:23 అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసికొనుమని బతిమాలి, రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి, తన పనివారిలో ఇద్దరిమీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికొనిపోయిరి.

2రాజులు 5:24 మెట్లదగ్గరకు వారు రాగానే వారియొద్దనుండి గేహజీ వాటిని తీసికొని యింటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్లిపోయిరి.

2రాజులు 5:25 అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గేహజీ, నీవెచ్చటనుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలేదనెను.

2రాజులు 5:26 అంతట ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?

2రాజులు 5:27 కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుటనుండి బయటికి వెళ్లెను.

నెహెమ్యా 5:15 అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనులయొద్దనుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి; వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయముచేత నేనాలాగున చేయలేదు.

సామెతలు 29:12 అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్థులందరు దుష్టులుగా నుందురు

అపోస్తలులకార్యములు 16:19 ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి, పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొనిపోయిరి.

లేవీయకాండము 6:4 అతడు పాపముచేసి అపరాధియగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చిగాని బలాత్కారముచేతను అపహరించినదాని గూర్చిగాని తనకు అప్పగింపబడినదాని గూర్చిగాని, పోయి తనకు దొరికినదాని గూర్చిగాని, దేనిగూర్చియైతే తాను అబద్ధప్రమాణము చేసెనో దానినంతయు మరల ఇచ్చుకొనవలెను.

1రాజులు 18:26 వారు తమకు ఇయ్యబడిన యెద్దును తీసికొని సిద్ధముచేసి, ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా, మా ప్రార్థన వినుమని బయలు పేరునుబట్టి ప్రార్థనచేసిరి గాని యొక మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేకపోగా, వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులువేయ మొదలుపెట్టిరి.

యెషయా 59:6 వారి పట్టుబట్ట నేయుటకు పనికిరాదు వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపదు వారి క్రియలు పాపక్రియలే వారు బలాత్కారము చేయువారే.

యిర్మియా 17:11 న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టవలె నున్నాడు; సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును; అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును.

యెహెజ్కేలు 8:17 అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు.

యెహెజ్కేలు 18:7 ఎవనినైనను భాదపెట్టకయు, ఋణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారముచేత ఎవనికైనను నష్టము కలుగజేయకయు నుండువాడై, ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి

యెహెజ్కేలు 28:16 అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముచేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతముమీద నీవుండకుండ నేను నిన్ను అపవిత్రపరచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబూ, కాలుచున్న రాళ్లమధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని.

ఆమోసు 3:10 వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారముచేతను దోపుడుచేతను సొమ్ము సమకూర్చుకొందురు.

మీకా 6:10 అన్యాయము చేయువారి యిండ్లలో అన్యాయముచేత సంపాదించిన సొత్తులును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా.

జెఫన్యా 1:13 వారి ఆస్తి దోపుడుసొమ్మగును, వారి ఇండ్లు పాడగును, వారు ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపురముండరు, ద్రాక్షతోటలు నాటుదురు గాని వాటి రసమును పానము చేయరు.