Logo

ఫిలిప్పీయులకు అధ్యాయము 4 వచనము 23

రోమీయులకు 16:16 పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.

2కొరిందీయులకు 13:13 పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు.

హెబ్రీయులకు 13:24 మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. ఇటలీవారు మీకు వందనములు చెప్పుచున్నారు.

1పేతురు 5:13 బబులోనులో మీవలె నేర్పరచబడిన ఆమెయు, నా కుమారుడైన మార్కును, మీకు వందనములు చెప్పుచున్నారు.

3యోహాను 1:14 శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను; అప్పుడు ముఖాముఖిగా మాటలాడుకొనెదము. నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీయొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము.

ఫిలిప్పీయులకు 1:13 ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికిని తక్కినవారి కందరికిని స్పష్టమాయెను.

లూకా 2:1 ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయెను.

లూకా 8:3 వీరును ఇతరులనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి.

లూకా 20:24 దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరువనిరి.

అపోస్తలులకార్యములు 13:1 అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతో కూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి

అపోస్తలులకార్యములు 17:34 అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరు నుండిరి.

1కొరిందీయులకు 1:26 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని

1కొరిందీయులకు 16:20 సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని, మీరు ఒకరికి ఒకరు వందనములు చేసికొనుడి.

2తిమోతి 4:21 శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నముచేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు.