Logo

ఫిలేమోనుకు అధ్యాయము 1 వచనము 24

కొలొస్సయులకు 1:7 ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసునివలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి.

కొలొస్సయులకు 4:12 మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు; మీరు సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలుకడగా ఉండవలెనని యితడెల్లప్పుడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు.

రోమీయులకు 16:7 నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధికెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.

కొలొస్సయులకు 4:10 నాతో కూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి.

1కొరిందీయులకు 16:20 సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని, మీరు ఒకరికి ఒకరు వందనములు చేసికొనుడి.

2కొరిందీయులకు 13:13 పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు.

ఫిలిప్పీయులకు 4:21 ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి.