Logo

యూదా అధ్యాయము 1 వచనము 1

ఆదికాండము 43:23 అందుకతడు మీకు క్షేమమగును గాక భయపడకుడి; మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారియొద్దకు తీసికొని వచ్చెను

దానియేలు 4:1 రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆ యా భాషలు మాటలాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక.

గలతీయులకు 5:16 నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.

ఎఫెసీయులకు 6:23 తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక.

1పేతురు 5:14 ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికిని సమాధానము కలుగును గాక. ఆమేన్‌.

రోమీయులకు 16:10 క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టొబూలు ఇంటివారికి వందనములు.

రోమీయులకు 16:11 నా బంధువుడగు హెరోదియోనుకు వందనములు. నార్కిస్సు ఇంటివారిలో ప్రభువునందున్న వారికి వందనములు.

రోమీయులకు 16:1 కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని,

రోమీయులకు 16:2 ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలైయుండెను.

రోమీయులకు 16:3 క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి.

రోమీయులకు 16:4 వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులైయున్నారు.

రోమీయులకు 16:5 ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.

రోమీయులకు 16:6 మీకొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు.

రోమీయులకు 16:7 నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధికెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.

రోమీయులకు 16:8 ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లీయతునకు వందనములు.

రోమీయులకు 16:9 క్రీస్తునందు మన జతపనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు.

రోమీయులకు 16:10 క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టొబూలు ఇంటివారికి వందనములు.

రోమీయులకు 16:11 నా బంధువుడగు హెరోదియోనుకు వందనములు. నార్కిస్సు ఇంటివారిలో ప్రభువునందున్న వారికి వందనములు.

రోమీయులకు 16:12 ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు; ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను.

రోమీయులకు 16:13 ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు; అతని తల్లికి వందనములు; ఆమె నాకును తల్లి.

రోమీయులకు 16:14 అసుంక్రితుకును, ప్లెగోనుకును, హెర్మేకును, పత్రొబకును, హెర్మాకును వారితో కూడ నున్న సహోదరులకును వందనములు.

రోమీయులకు 16:15 పిలొలొగుకును, యూలియాకును, నేరియకును, అతని సహోదరికిని, ఒలుంపాకును వారితోకూడ ఉన్న పరిశుద్దులకందరికిని వందనములు.

రోమీయులకు 16:16 పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.

మత్తయి 10:12 ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి.

అపోస్తలులకార్యములు 15:23 వీరు వ్రాసి, వారిచేత పంపినదేమనగా అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయలోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము.

అపోస్తలులకార్యములు 23:26 యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు, అతడు రోమీయుడని నేను విని, సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని.

2కొరిందీయులకు 13:13 పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు.

ఫిలిప్పీయులకు 2:24 నేనును శీఘ్రముగా వచ్చెదనని ప్రభువునుబట్టి నమ్ముచున్నాను.

ఫిలిప్పీయులకు 4:22 నాతో కూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరును ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు.

1తిమోతి 3:14 శీఘ్రముగా నీయొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను;

2తిమోతి 4:21 శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నముచేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు.

ఫిలేమోనుకు 1:22 అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము.