Logo

న్యాయాధిపతులు అధ్యాయము 11 వచనము 18

సంఖ్యాకాండము 20:22 అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేషులోనుండి సాగి హోరుకొండకు వచ్చెను.

సంఖ్యాకాండము 21:10 తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి.

సంఖ్యాకాండము 21:11 ఓబోతులోనుండి వారు సాగి సూర్యోదయదిక్కున, అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయ్యె అబారీమునొద్ద దిగిరి.

సంఖ్యాకాండము 21:12 అక్కడనుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి.

సంఖ్యాకాండము 21:13 అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు.

సంఖ్యాకాండము 33:37 కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశము కడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.

సంఖ్యాకాండము 33:38 యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.

సంఖ్యాకాండము 33:39 అహరోను నూట ఇరువది మూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను.

సంఖ్యాకాండము 33:40 అప్పుడు దక్షిణదిక్కున కనాను దేశమందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను.

సంఖ్యాకాండము 33:41 వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.

సంఖ్యాకాండము 33:42 సల్మానాలోనుండి బయలుదేరి పూనొనులో దిగిరి.

సంఖ్యాకాండము 33:43 పూనొనులోనుండి బయలుదేరి ఓబోతులో దిగిరి.

సంఖ్యాకాండము 33:44 ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేరయొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.

ద్వితియోపదేశాకాండము 2:1 మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎఱ్ఱసముద్రమార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహు దినములు శేయీరు మన్నెము చుట్టు తిరిగితివిు.

ద్వితియోపదేశాకాండము 2:2 అంతట యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను మీరు ఈ మన్నెముచుట్టు తిరిగినకాలము చాలును;

ద్వితియోపదేశాకాండము 2:3 ఉత్తరదిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము

ద్వితియోపదేశాకాండము 2:4 శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవుచున్నారు, వారు మీకు భయపడుదురు; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి.

ద్వితియోపదేశాకాండము 2:5 వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను.

ద్వితియోపదేశాకాండము 2:6 మీరు రూకలిచ్చి వారియొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారియొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును.

ద్వితియోపదేశాకాండము 2:7 నీచేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన యెరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమియు తక్కువకాదు.

ద్వితియోపదేశాకాండము 2:8 అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపువారైన మన సహోదరులను విడిచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గమునుండి మనము ప్రయాణము చేసితివిు.

సంఖ్యాకాండము 21:4 వారు ఎదోముదేశమును చుట్టిపోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గాయాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.

సంఖ్యాకాండము 21:5 కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి.

సంఖ్యాకాండము 21:6 అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి.

సంఖ్యాకాండము 21:7 కాబట్టి ప్రజలు మోషేయొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితివిు; యెహోవా మామధ్యనుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి.

సంఖ్యాకాండము 21:8 మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పమువంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను.

సంఖ్యాకాండము 21:9 కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభముమీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.

సంఖ్యాకాండము 21:11 ఓబోతులోనుండి వారు సాగి సూర్యోదయదిక్కున, అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయ్యె అబారీమునొద్ద దిగిరి.

సంఖ్యాకాండము 21:13 అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు.

సంఖ్యాకాండము 22:36 బిలాము వచ్చెనని బాలాకు విని, ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణమువరకు అతనిని ఎదుర్కొన బయలువెళ్లగా

సంఖ్యాకాండము 20:21 ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరలలోబడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు అతనియొద్దనుండి తొలగిపోయిరి.

ద్వితియోపదేశాకాండము 2:8 అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపువారైన మన సహోదరులను విడిచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గమునుండి మనము ప్రయాణము చేసితివిు.

ద్వితియోపదేశాకాండము 2:24 మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి; ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీచేతికి అప్పగించితిని. దాని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి.

ద్వితియోపదేశాకాండము 2:29 శేయీరులో నివసించు ఏశావు సంతానపువారును ఆరులో నివసించు మోయాబీయులును నాకు చేసినట్లు, మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యొర్దాను దాటువరకు కాలినడకచేతనే నన్ను వెళ్లనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని.

యెహోషువ 12:1 ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల నున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా

యెషయా 16:2 గూటినుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె అర్నోను రేవులయొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు.

యిర్మియా 48:20 మోయాబు పడగొట్టబడినదై అవమానము నొందియున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి

జెకర్యా 1:20 యెహోవా నలుగురు కంసాలులను నాకు కనుపరచగా