Logo

న్యాయాధిపతులు అధ్యాయము 13 వచనము 25

న్యాయాధిపతులు 3:10 యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతనిచేతికప్పగించెను, ఆతడు కూషన్రిషాతాయిమును జయించెను.

న్యాయాధిపతులు 6:34 యెహోవా ఆత్మ గిద్యోనును ఆవే శించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపువారు అతనియొద్దకు వచ్చిరి.

న్యాయాధిపతులు 11:29 యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదు లోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పే లో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయులయొద్దకు సాగెను.

1సమూయేలు 11:6 సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై

మత్తయి 4:1 అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను.

యోహాను 3:34 ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలత లేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.

న్యాయాధిపతులు 18:12 అందుచేతను నేటివరకు ఆ స్థల మునకు దానీయులదండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమట నున్నది.

న్యాయాధిపతులు 18:11 అప్పుడు జొర్యాలోను ఎష్తాయోలులోను ఉన్న దానీయులైన ఆరువందలమంది యుద్ధాయుధములు కట్టు కొని అక్కడనుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి.

యెహోషువ 15:33 మైదానములో ఏవనగా ఎష్తాయోలు జొర్యా అష్నా

ఆదికాండము 21:20 దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను.

ఆదికాండము 49:16 దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును.

ద్వితియోపదేశాకాండము 33:22 దానునుగూర్చి యిట్లనెను దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును.

యెహోషువ 19:41 వారి స్వాస్థ్యపు సరిహద్దు జొర్యా

న్యాయాధిపతులు 14:6 యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతనిచేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు.

న్యాయాధిపతులు 14:19 యెహోవా ఆత్మ అతనిమీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో ముప్పదిమందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పినవారికి బట్టలనిచ్చెను.

న్యాయాధిపతులు 16:31 అప్పుడు అతని స్వదేశజనులును అతని తండ్రి యింటివా రందరును కూడి అతనిని మోసికొనివచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రియైన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను.

న్యాయాధిపతులు 18:2 ఆ దేశసంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థు లందరిలోనుండి పరాక్రమ వంతులైన అయిదుగురు మను ష్యులను జొర్యానుండియు ఎష్తాయోలునుండియు పంపిమీరు వెళ్లి దేశమును పరిశోధించుడని వారితోచెప్పగా

1సమూయేలు 16:13 సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను.

1దినవృత్తాంతములు 2:53 కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మాతీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయులును ఎష్తాయులీయులును కలిగిరి.

1దినవృత్తాంతములు 4:2 శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను, యహతు అహూమైని లహదును కనెను, ఇవి సొరాతీయుల వంశములు.

1దినవృత్తాంతములు 12:18 అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడై దావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక,నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను.

నెహెమ్యా 11:29 ఏన్రిమ్మోనులోను జొర్యాలోను యర్మూతులోను

కీర్తనలు 51:11 నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.

యెహెజ్కేలు 2:2 ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికివచ్చి నన్ను నిలువబెట్టెను; అప్పుడు నాతో మాటలాడినవాని స్వరము వింటిని.

లూకా 1:66 ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులనుగూర్చి వినిన వారందరును ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.

లూకా 1:80 శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను.