న్యాయాధిపతులు 20:7 ఇదిగో ఇశ్రాయేలీయులారా, యిక్కడనే మీరందరు కూడియున్నారు, ఈ సంగతినిగూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను.
సామెతలు 11:14 నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.
సామెతలు 13:10 గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.
సామెతలు 15:22 ఆలోచన చెప్పువారు లేనిచోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.
సామెతలు 20:18 ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము.
సామెతలు 24:6 వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము
యోబు 34:4 న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసికొందము రండి.
సామెతలు 6:34 భర్తకు పుట్టు రోషము మహా రౌద్రము గలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు.
యిర్మియా 2:10 కీత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా?