Logo

న్యాయాధిపతులు అధ్యాయము 21 వచనము 3

ద్వితియోపదేశాకాండము 29:24 యెహోవా దేనిబట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు.

యెహోషువ 7:7 అయ్యో, ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీయులచేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీ వెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివ సించుట మేలు.

యెహోషువ 7:8 ప్రభువా కనికరించుము; ఇశ్రాయేలీయులు తమ శత్రువులయెదుట నిలువలేక వెనుకకు తిరిగి నందుకు నేనేమి చెప్పగలను?

యెహోషువ 7:9 కనానీయులును ఈ దేశ నివాసులందరును విని, మమ్మును చుట్టుకొని మా పేరు భూమిమీద ఉండకుండ తుడిచివేసినయెడల, ఘనమైన నీ నామమునుగూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా

కీర్తనలు 74:1 దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొఱ్ఱలమీద నీ కోపము పొగ రాజుచున్నదేమి?

కీర్తనలు 80:12 త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి?

సామెతలు 19:3 అట్టివాడు హృదయమున యెహోవామీద కోపించును.

యెషయా 63:17 యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగిరమ్ము.

యిర్మియా 12:1 యెహోవా, నేను నీతో వాదించునప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు; అయినను న్యాయము విధించుటనుగూర్చి నేను నీతో మాటలాడుదును; దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల? మహా విశ్వాసఘాతకులు సుఖింపనేల?

న్యాయాధిపతులు 17:6 ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజులేడు; ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను.