Logo

యెహోషువ అధ్యాయము 20

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చిన దేమనగా

02 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముతెలియ కయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారి పోవుటకు నేను మోషేనోట మీతో పలికించిన ఆశ్రయ పురములను మీరు ఏర్పరచుకొనవలెను.

03 హత్యవిషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును.

04 ఒకడు ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పురద్వార మునొద్ద నిలిచి, ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత, వారు పురములోనికి వానిని చేర్చుకొని తమయొద్ద నివ సించుటకు వానికి స్థలమియ్యవలెను.

05 హత్యవిషయములో ప్రతి హత్య చేయువాడు వానిని తరిమినయెడల వానిచేతికి ఆ సరహంతుకుని అప్పగింపకూడదు; ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపెనుగాని అంతకు మునుపు వానియందు పగపట్టలేదు.

06 అతడు తీర్పు నొందుటకై సమాజము నెదుట నిలుచువరకును, తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణము నొందువరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణమునుండి పారిపోయెనో ఆ పట్టణమునకును తన యింటికిని తిరిగి రావలెను.

07 అప్పుడు వారు నఫ్తా లీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయి మీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిర్యతర్బాను ప్రతిష్ఠపరచిరి.

08 తూర్పుదిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీ యుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్య ములోని బేసెరును, గాదీయుల గోత్రము లోనుండి గిలాదు లోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి.

09 పొరబాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువకమునుపు అక్కడికి పారిపోయి హత్యవిషయమై ప్రతిహత్య చేయు వానిచేత చంపబడక యుండునట్లు ఇశ్రాయేలీయులకంద రికిని వారిమధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి.