Logo

1రాజులు అధ్యాయము 5 వచనము 1

1రాజులు 5:10 హీరాము సొలొమోనునకు ఇష్టమైనంతమట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా

1రాజులు 5:13 రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిచేతను వెట్టిపని చేయించెను; వారిలో ముప్పదివేలమంది వెట్టిపని చేయువారైరి,

1రాజులు 9:12 హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరునుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక

1రాజులు 9:13 నా సహోదరుడా, నీవు నాకిచ్చిన యీ పట్టణములు ఏపాటివనెను. నేటివరకు వాటికి కాబూల్‌1 అని పేరు.

1రాజులు 9:14 హీరాము రెండువందల నలువది మణుగుల బంగారమును రాజునకు పంపించెను.

2దినవృత్తాంతములు 2:3 సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతలచేత ఈ వర్తమానము పంపెను నా తండ్రియైన దావీదు నివాసమునకై యొక నగరును కట్టతలచియుండగా నీవు అతనికి సరళ మ్రానులను సిద్ధముచేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము.

2సమూయేలు 8:10 హదదె జెరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదెజెరుతో యుద్ధము చేసి అతనిని ఓడించియుండుట తోయి విని, తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలడిగి దావీదుతోకూడ సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను.

2సమూయేలు 10:1 పిమ్మట అమ్మోను రాజు మృతినొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను.

2సమూయేలు 10:2 దావీదు హానూను తండ్రియైన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనునకు ప్రత్యుపకారము చేతుననుకొని, అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకై తన సేవకులచేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా

కీర్తనలు 45:12 తూరు కుమార్తె నైవేద్యము తీసికొనివచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు.

2సమూయేలు 5:11 తూరు రాజగు హీరాము, దూతలను దేవదారు మ్రానులను వడ్రంగులను కాసెపనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి.

1దినవృత్తాంతములు 14:1 తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను, అతనికి ఒక యిల్లు కట్టుటకై దేవదారు మ్రానులను, కాసె పనివారిని వడ్లవారిని పంపెను.

ఆమోసు 1:9 యెహోవా సెలవిచ్చునదేమనగా తూరు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారినందరిని ఎదోమీయులకు అప్పగించిరి.

1రాజులు 9:13 నా సహోదరుడా, నీవు నాకిచ్చిన యీ పట్టణములు ఏపాటివనెను. నేటివరకు వాటికి కాబూల్‌1 అని పేరు.

యెహెజ్కేలు 27:5 నీ ఓడలను శెనీరు దేశపు సరళవృక్షపు మ్రానుతో కట్టుదురు, లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడకొయ్యలు చేయుదురు.

లూకా 7:5 అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి.

అపోస్తలులకార్యములు 7:47 అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను.

తీతుకు 1:8 అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహము గలవాడునై యుండి,