Logo

1రాజులు అధ్యాయము 10 వచనము 21

2దినవృత్తాంతములు 9:20 మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నియును బంగారపువై యుండెను; లెబానోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నియు బంగారముతో చేసినవి; హీరాముయొక్క పనివారితో కూడ రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరములకు ఒక మారు బంగారము, వెండి, యేనుగు దంతము, కోతులు, నెమళ్లు అను సరకులతో వచ్చుచుండెను గనుక

2దినవృత్తాంతములు 9:21 సొలొమోను దినములలో వెండి యెన్నికకు రానిదాయెను

2దినవృత్తాంతములు 9:22 రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను.

1రాజులు 10:17 మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు మూడువందల కేడెములను చేయించెను; కేడెము ఒకటింటికి మూడువందల బంగారపు తులములయెత్తు బంగారముండెను; వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను.

1రాజులు 7:2 మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను; దీని పొడుగు నూరు మూరలు, వెడల్పు ఏబది మూరలు, ఎత్తు ముప్పది మూరలు; నాలుగు వరుసల దేవదారు స్తంభములమీద దేవదారు దూలములు వేయబడెను.

ద్వితియోపదేశాకాండము 17:17 తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు; వెండిబంగారములను అతడు తనకొరకు బహుగా విస్తరింపజేసికొనకూడదు.

1రాజులు 9:14 హీరాము రెండువందల నలువది మణుగుల బంగారమును రాజునకు పంపించెను.

1దినవృత్తాంతములు 28:17 ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును, బంగారు గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత వెండిని యెత్తు ప్రకారముగాను,

ఎస్తేరు 1:7 అచ్చట కూడినవారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు, రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి.

యోబు 22:24 మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము

యోబు 28:1 వెండికి గని గలదు పుటమువేయు సువర్ణమునకు స్థలము గలదు.

యెషయా 2:7 వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది వారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది వారి రథములకు మితిలేదు.

యెషయా 60:17 నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.