Logo

1రాజులు అధ్యాయము 11 వచనము 28

సామెతలు 22:29 తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.

1రాజులు 5:16 వీరు కాక పనిమీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు మూడువేల మూడువందలమంది; వీరు పనివారిమీద అధికారులై యుండిరి.

ద్వితియోపదేశాకాండము 1:12 నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను?

యెషయా 14:25 నా దేశములో అష్షూరును సంహరించెదను నా పర్వతములమీద వాని నలుగద్రొక్కెదను వాని కాడి నా జనులమీదనుండి తొలగిపోవును వాని భారము వారి భుజముమీదనుండి తొలగింపబడును.

మత్తయి 11:30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.

యెహోషువ 18:5 వారు ఏడువంతులుగా దాని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణదిక్కున తమ సరిహద్దులోపల నిలిచి యుండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దులోపల నిలిచి యుండవలెను.

న్యాయాధిపతులు 1:22 యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవా వారికి తోడైయుండెను.

న్యాయాధిపతులు 1:23 పూర్వము లూజనబడిన బేతే లును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా

2సమూయేలు 19:20 నేను పాపము చేసితినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడ నా యేలినవాడవును రాజవునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చియున్నాననెను.

ఆమోసు 5:6 యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకుదురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండ అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతిమీద పడి దాని నాశనము చేయును.

జెకర్యా 10:6 నేను యూదావారిని బలశాలురుగా చేసెదను, యోసేపు సంతతివారికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలము ఇచ్చెదను, నేను వారియెడల జాలిపడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు.

1రాజులు 11:26 మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజుమీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయీమీయుడైన నెబాతు కుమారుడు, ఇతని తల్లిపేరు జెరూహా, ఆమె విధవరాలు.

2దినవృత్తాంతములు 10:2 రాజైన సొలొమోను సమక్షమునుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తునుండి తిరిగిరాగా జనులు అతని పిలిపించిరి.

సామెతలు 12:24 శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టిపనులు చేయవలసి వచ్చును.