Logo

1రాజులు అధ్యాయము 15 వచనము 34

1రాజులు 15:26 అతడు యెహోవా దృష్టికి కీడుచేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి, అతడు దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడాయెనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను.

1రాజులు 15:26 అతడు యెహోవా దృష్టికి కీడుచేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి, అతడు దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడాయెనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను.

1రాజులు 12:28 ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము;

1రాజులు 12:29 ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను.

1రాజులు 13:33 ఈ సంగతియైన తరువాత యరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక, సామాన్యజనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను.

1రాజులు 13:34 యరొబాము సంతతివారిని నిర్మూలము చేసి భూమిమీద ఉండకుండ నశింపజేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను.

1రాజులు 14:16 మరియు తానే పాపముచేసి ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడైన యరొబాము పాపములనుబట్టి ఆయన ఇశ్రాయేలువారిని అప్పగింపబోవుచున్నాడు.

యెషయా 1:4 పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించియున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయియున్నారు.

ద్వితియోపదేశాకాండము 12:13 నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహనబలులను అర్పింపకూడదు సుమీ.

1రాజులు 14:9 నీకంటె ముందుగా ఉండిన వారందరికంటెను అధికముగా కీడు చేసియున్నావు; నన్ను బొత్తిగా విసర్జించి యితర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించియున్నావు.

1రాజులు 16:2 నేను నిన్ను మంటిలోనుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలువారను నా జనులమీద నిన్ను అధికారిగా చేసితిని, అయినను యరొబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు, ఇశ్రాయేలువారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై, వారి పాపములచేత నాకు కోపము పుట్టించియున్నావు.

1రాజులు 16:19 యరొబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడై యుండి తానే పాపము చేయుచు, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైనందున ఈలాగున జరిగెను.

1రాజులు 21:22 ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

1రాజులు 22:52 అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి,తన తలిదండ్రులిద్దరి ప్రవర్తనను, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను.

2రాజులు 3:3 ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను.