Logo

1రాజులు అధ్యాయము 16 వచనము 8

1రాజులు 14:17 అప్పుడు యరొబాము భార్య లేచి వెళ్లిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను; ఆమె లోగిటి ద్వారపు గడపయొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను.

1రాజులు 15:32 వారి దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగుచుండెను.

1రాజులు 15:33 యూదారాజైన ఆసా యేలుబడిలో మూడవ సంవత్సరమందు అహీయా కుమారుడైన బయెషా తిర్సాయందు ఇశ్రాయేలువారినందరిని ఏలనారంభించి యిరువది నాలుగు సంవత్సరములు ఏలెను.

1రాజులు 16:6 బయెషా తన పితరులతో కూడ నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను; అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయెను.

1రాజులు 16:15 యూదా రాజైన ఆసా యేలుబడిలో ఇరువదియేడవ సంవత్సరమున జిమీ తిర్సాలో ఏడు దినములు ఏలెను. జనులు ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా

1రాజులు 16:21 అప్పుడు ఇశ్రాయేలువారు రెండు జట్లుగా విడిపోయి, జనులలో సగముమంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలెనని అతని పక్షమునను, సగముమంది ఒమీ పక్షమునను చేరిరి.

1రాజులు 16:23 యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియొకటవ సంవత్సరమున ఒమీ ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను; ఆ పండ్రెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను.

2రాజులు 15:14 గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలోనుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులోనుండు యాబేషు కుమారుడైన షల్లూముమీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను.

2రాజులు 15:23 యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదియవ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను.

2రాజులు 21:19 ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యెరూషలేమునందు రెండు సంవత్సరములు ఏలెను, అతని తల్లి యొట్బయూరివాడగు హారూసు కుమార్తెయైన మెషుల్లెమెతు.

సామెతలు 28:2 దేశస్థుల దోషమువలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధిజ్ఞానములు గలవారిచేత దాని అధికారము స్థిరపరచబడును.