Logo

1రాజులు అధ్యాయము 19 వచనము 20

మత్తయి 4:20 వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

మత్తయి 4:22 వంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

మత్తయి 9:9 యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను.

మత్తయి 19:27 పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివిు గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా

మత్తయి 8:21 శిష్యులలో మరియొకడు ప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా

మత్తయి 8:22 యేసు అతని చూచి నన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను.

లూకా 9:61 మరియొకడు ప్రభువా, నీవెంట వచ్చెదను గాని నా యింటనున్న వారియొద్ద సెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా

లూకా 9:62 యేసు నాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను.

అపోస్తలులకార్యములు 20:37 అప్పుడు వారందరు చాల ఏడ్చిరి. మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు

ఆదికాండము 31:28 అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దుపెట్టుకొన నియ్యక పిచ్చిపట్టి యిట్లు చేసితివి.

ఆదికాండము 48:10 ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యమువలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసికొనివచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను.

రూతు 1:14 వారు ఎలుగెత్తి యేడ్వగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా

2సమూయేలు 19:39 జనులందరును రాజును నది యవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దుపెట్టుకొని దీవించెను; తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్లిపోయెను.

కీర్తనలు 78:70 తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱల దొడ్లలోనుండి అతని పిలిపించెను.

మార్కు 1:20 వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

లూకా 9:59 ఆయన మరియొకనితో నా వెంటరమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను