Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 4 వచనము 2

నిర్గమకాండము 30:18 ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను.

నిర్గమకాండము 30:19 ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులును తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను.

నిర్గమకాండము 30:20 వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును సేవచేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను.

నిర్గమకాండము 30:21 తాము చావక యుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును.

1రాజులు 7:23 మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను; అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచువరకు పది మూరలు, అది అయిదుమూరల యెత్తుగలదై గుండ్రముగా ఉండెను; దాని కైవారము ముప్పది మూరలు.

జెకర్యా 13:1 ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతివారి కొరకును, యెరూషలేము నివాసుల కొరకును ఊట యొకటి తియ్యబడును.

తీతుకు 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

ప్రకటన 7:14 అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను వీరు మహా శ్రమలనుండి వచ్చినవారు; గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొనిరి.

1రాజులు 6:29 మరియు మందిరపు గోడలన్నిటిమీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను.

2రాజులు 25:13 మరియు యెహోవా మందిరమందున్న యిత్తిడి స్తంభములను మట్లను యెహోవా మందిరమందున్న యిత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి, ఆ యిత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోయిరి.

1దినవృత్తాంతములు 18:8 హదరెజెరుయొక్క పట్టణములైన టిబ్హతులోనుండియు, కూనులోనుండియు దావీదు బహు విస్తారమైన యిత్తడిని తీసికొనివచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములును ఇత్తడి వస్తువులను చేయించెను.

2దినవృత్తాంతములు 4:6 మరియు దహనబలులుగా అర్పించువాటిని కడుగుటకై కుడి తట్టుకు అయిదును ఎడమ తట్టుకు అయిదును పది స్నానపు గంగాళములను చేయించెను; సముద్రమువంటి తొట్టియందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు.

2దినవృత్తాంతములు 4:15 సముద్రపుతొట్టి దాని క్రిందనుండు పండ్రెండు ఎద్దులు,

యిర్మియా 27:19 బబులోను రాజైన నెబుకద్రెజరు యెరూషలేములోనుండి యెహోయాకీము కుమారుడైన యెకోన్యాను యూదా యెరూషలేముల ప్రధానులనందరిని బబులోనునకు చెరగా తీసికొనిపోయినప్పుడు