Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 11 వచనము 18

1సమూయేలు 16:6 వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచియున్నాడని అనుకొనెను

1సమూయేలు 17:13 అయితే యెష్షయి యొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా,

1సమూయేలు 17:28 అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్నయగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితో నీవిక్కడికెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱమందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితివనెను.

1దినవృత్తాంతములు 2:13 యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను

1దినవృత్తాంతములు 27:18 దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారుడైన ఒమీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను,

2సమూయేలు 5:13 దావీదు హెబ్రోనునుండి వచ్చిన తరువాత యెరూషలేములోనుండి యింక అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసికొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులును కుమార్తెలును పుట్టిరి