Logo

ఎజ్రా అధ్యాయము 4 వచనము 10

ఎజ్రా 4:1 అంతట యూదావంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైనవారు, చెరనివారణ యయినవారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని

2రాజులు 17:24 అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అను తన దేశములలోనుండి జనులను రప్పించి, ఇశ్రాయేలువారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వంతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి.

2రాజులు 17:25 అయితే వారు కాపురముండ నారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను.

2రాజులు 17:26 తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా

2రాజులు 17:27 అష్షూరు రాజు అచ్చటనుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొనిపోవుడి; అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను.

2రాజులు 17:28 కాగా షోమ్రోనులోనుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి, యెహోవాయందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను గాని

2రాజులు 17:29 కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీయులు కట్టుకొనిన ఉన్నతస్థలముల మందిరములలో వాటిని ఉంచుచువచ్చిరి; మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగజేసికొనిరి.

2రాజులు 17:30 బబులోనువారు సుక్కోత్బెనోతు దేవతను, కూతావారు నెర్గలు దేవతను, హమాతువారు అషీమా దేవతను,

2రాజులు 17:31 ఆవీయులు నిబ్హజు దేవతను తర్తాకు దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకొనుచుండిరి. సెపర్వీయులు తమ పిల్లలను ఆద్రమ్మెలెకు అనెమ్మెలెకు అను సెపర్వయీముయొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి.

2రాజులు 17:32 మరియు జనులు యెహోవాకు భయపడి, ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసికొనగా వారు జనులపక్షమున ఉన్నతస్థలములలో కట్టబడిన మందిరములయందు బలులు అర్పించుచుండిరి.

2రాజులు 17:33 ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారైయుండి, తాము ఏ జనులలోనుండి పట్టబడిరో ఆ యా జనుల మర్యాదచొప్పున తమ దేవతలను పూజించుచుండిరి.

2రాజులు 17:34 నేటి వరకు తమ పూర్వమర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు; యెహోవాయందు భయభక్తులు పూనక వారితో నిబంధనచేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు, వాటికి నమస్కరింపకయు, పూజ చేయకయు, బలులు అర్పింపకయు,

2రాజులు 17:35 మహాధికారము చూపి బాహు బలముచేత ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారముచేసి బలులు అర్పింపవలెనని ఇశ్రాయేలని పేరుపెట్టబడిన యాకోబు సంతతివారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు

2రాజులు 17:36 ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు.

2రాజులు 17:37 మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రదుకు దినములన్నియు మోషే మీకు వ్రాసియిచ్చిన కట్టడలను విధులను, అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను.

2రాజులు 17:38 నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను.

2రాజులు 17:39 మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు గలవారై యుండినయెడల ఆయన మీ శత్రువులచేతిలోనుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను

2రాజులు 17:40 వారు ఆయన మాటవినక తమ పూర్వపు మర్యాదచొప్పుననే జరిగించుచు వచ్చిరి.

2రాజులు 17:41 ఆ ప్రజలు ఆలాగున యెహోవాయందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచు వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి యింటివారును వారి సంతతివారును నేటివరకు చేయుచున్నారు.

రోమీయులకు 13:7 ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండవలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మానముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.

ఎజ్రా 4:11 వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యివతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయునదేమనగా

ఎజ్రా 4:17 అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును లేఖకుడగు షివ్షుయికిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవతలనుండు తక్కినవారికిని మీకు క్షేమసంప్రాప్తియగును గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా

ఎజ్రా 7:12 రాజైన అర్తహషస్త, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము, మొదలగు మాటలు వ్రాసి యీలాగు సెలవిచ్చెను

1రాజులు 13:32 యెహోవా మాటనుబట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను, షోమ్రోను పట్టణములోనున్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికి విరోధము గాను, అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను.

ఎజ్రా 4:2 జరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానులయొద్దకును వచ్చి మీరు ఆశ్రయించునట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి.

నెహెమ్యా 4:2 షోమ్రోను దండువారి యెదుటను తన స్నేహితుల యెదుటను ఇట్లనెను దుర్బలులైన యీ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే యీ పని ముగింతురా? బలులు అర్పించి బలపరచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా?

యెషయా 8:7 కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటిమీదను పొర్లిపారును.

యెషయా 23:13 ఇదిగో కల్దీయుల దేశమును చూడుము వారికను జనముగా ఉండరు అష్షూరీయులు దానిని అడవిమృగములకు నివాసముగా చేసియున్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు.