Logo

ఎజ్రా అధ్యాయము 8 వచనము 15

కీర్తనలు 137:1 బబులోను నదులయొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చు చుంటిమి.

యెహెజ్కేలు 1:1 ముప్పదియవ సంవత్సరము నాలుగవ నెల అయిదవ దినమున నేను కెబారు నదీప్రదేశమున చెరలోని వారిమధ్య కాపురముంటిని; ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవునిగూర్చిన దర్శనములు నాకు కలిగెను.

యెహెజ్కేలు 3:15 నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడినవారియొద్దకు వచ్చి, వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి యేమియు చెప్పకయు కదలకయు నున్నవాడనై యేడు దినములు వారి మధ్య నుంటిని.

అపోస్తలులకార్యములు 16:13 విశ్రాంతిదినమున గవిని దాటి నదీతీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, కూడివచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి.

ఎజ్రా 8:21 అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని.

ఎజ్రా 8:31 మేము మొదటి నెల పండ్రెండవ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నదినుండి బయలుదేరగా, మా దేవుని హస్తము మాకు తోడుగానుండి, శత్రువులచేతిలోనుండియు మార్గమందు పొంచియున్నవారిచేతిలోనుండియు మమ్మును తప్పించినందున

ఎజ్రా 8:2 ఫీనెహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశములో దానియేలును, దావీదు వంశములో హట్టూషును,

ఎజ్రా 7:7 మరియు రాజైన అర్తహషస్త ఏలుబడియందు ఏడవ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును యాజకులు కొందరును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి.

ఎజ్రా 7:24 మరియు యాజకులును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును, దేవుని మందిరపు సేవకులునైన వారందరినిగూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తు గాని సుంకము గాని పన్ను గాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికొనుడి.

నెహెమ్యా 12:27 యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయి తాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలోనుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి

యిర్మియా 31:6 ఎఫ్రాయిము పర్వతములమీద కావలివారు కేకవేసి సీయోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను.