Logo

నహూము అధ్యాయము 3 వచనము 14

యెషయా 19:16 ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీలవంటివారగుదురు. సైన్యములకధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయపడుదురు.

యిర్మియా 50:37 ఖడ్గము వారి గుఱ్ఱములమీద పడును వారి రథములమీద పడును ఖడ్గము వారిమీదికి దిగుటచేత దానిలోనున్న పరదేశులు స్త్రీలవంటివారగుదురు అది దాని నిధులమీద పడగా అవి దోచుకొనబడును.

యిర్మియా 51:30 బబులోను పరాక్రమవంతులు యుద్ధముచేయక మానుదురు వారు తమ కోటలలో నిలుచుచున్నారు వారి పరాక్రమము బలహీనత ఆయెను వారును స్త్రీలవంటివారైరి

నహూము 2:6 నదులదగ్గర నున్న గుమ్మములు తెరువబడుచున్నవి, నగరు పడిపోవుచున్నది.

కీర్తనలు 107:16 ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టియున్నాడు ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు.

యెషయా 45:1 అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.

యెషయా 45:2 నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను.

కీర్తనలు 147:13 ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచియున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు.

యిర్మియా 51:30 బబులోను పరాక్రమవంతులు యుద్ధముచేయక మానుదురు వారు తమ కోటలలో నిలుచుచున్నారు వారి పరాక్రమము బలహీనత ఆయెను వారును స్త్రీలవంటివారైరి

యెషయా 3:12 నా ప్రజలవిషయమై నేనేమందును? బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు

యిర్మియా 50:36 ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద పడును

ఆమోసు 1:5 దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలముచేతును, బెతేదేనులో ఉండకుండ రాజదండము వహించిన వానిని నిర్మూలముచేతును, సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

ఓబధ్యా 1:9 తేమానూ, నీ బలాఢ్యులు విస్మయమొందుదురు, అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరు హతులై నిర్మూలమగుదురు.

నహూము 3:15 అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనము చేయును, గొంగళిపురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడుతలంత విస్తారముగాను ఉండుము.