Logo

2కొరిందీయులకు అధ్యాయము 10 వచనము 12

2కొరిందీయులకు 12:20 ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములును కక్షలును కొండెములును గుసగుసలాడుటలును ఉప్పొంగుటలును అల్లరులును ఉండునేమో అనియు,

2కొరిందీయులకు 13:2 నేను మునుపు చెప్పితిని; నేనిప్పుడు మీయొద్ద లేకున్నను రెండవసారి మీయొద్దనున్నట్టుగానే, మునుపటినుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలినవారికందరికిని ముందుగా తెలియజేయునదేమనగా, నేను తిరిగి వచ్చినయెడల కనికరము చూపను.

2కొరిందీయులకు 13:3 క్రీస్తు నాయందు పలుకుచున్నాడని ఋజువు కోరుచున్నారా? ఆయన మీయెడల బలహీనుడు కాడు గాని, మీయందు శక్తిమంతుడైయున్నాడు.

2కొరిందీయులకు 13:10 కాబట్టి నేను మీయొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక, మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూరముగా ఉండగానే యీ సంగతులు వ్రాయుచున్నాను.

1కొరిందీయులకు 4:19 ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.

1కొరిందీయులకు 4:20 దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే యున్నది.

1కొరిందీయులకు 5:3 నేను దేహ విషయమై దూరముగా ఉన్నను ఆత్మ విషయమై సమీపముగా ఉండి, మీతోకూడ ఉండినట్టుగానే యిట్టి కార్యము ఈలాగు చేసినవానినిగూర్చి యిదివరకే తీర్పు తీర్చియున్నాను.

2కొరిందీయులకు 10:10 అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై యున్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని యొకడు అనును.

1దెస్సలోనీకయులకు 2:6 మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారము చేయుటకు సమర్థులమై యున్నను, మీవలననే గాని యితరులవలననే గాని, మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు.