Logo

2కొరిందీయులకు అధ్యాయము 10 వచనము 17

రోమీయులకు 15:24 నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మొదట మీ సహవాసమువలన కొంతమట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను.

రోమీయులకు 15:25 అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్యచేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను.

రోమీయులకు 15:26 ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియవారును అకయవారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి.

రోమీయులకు 15:27 అవును వారిష్టపడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారైయున్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయముచేయ బద్ధులై యున్నారు

రోమీయులకు 15:28 ఈ పనిని ముగించి యీ ఫలమును వారికప్పగించి, నేను, మీ పట్టణముమీదుగా స్పెయినునకు ప్రయాణముచేతును.

2కొరిందీయులకు 10:13 మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి యిచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము.

యోబు 38:5 నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.

రోమీయులకు 1:15 కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను.