Logo

గలతీయులకు అధ్యాయము 4 వచనము 11

లేవీయకాండము 23:1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

లేవీయకాండము 23:2 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామక కాలములు ఇవి.

లేవీయకాండము 23:3 ఆరు దినములు పనిచేయవలెను; వారము వారము ఏడవ దినము విశ్రాంతిదినము; అది పరిశుద్ధసంఘపు దినము. అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతిదినము.

లేవీయకాండము 23:4 ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములనుబట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధసంఘపు దినములు ఇవి.

లేవీయకాండము 23:5 మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును.

లేవీయకాండము 23:6 ఆ నెల పదునయిదవ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను

లేవీయకాండము 23:7 మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు.

లేవీయకాండము 23:8 ఏడు దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. ఏడవ దినమున పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము.

లేవీయకాండము 23:9 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

లేవీయకాండము 23:10 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకునియొద్దకు తేవలెను.

లేవీయకాండము 23:11 యెహోవా మిమ్మునంగీకరించునట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతిదినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను.

లేవీయకాండము 23:12 మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన యేడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను

లేవీయకాండము 23:13 దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ వంతుల గోధుమపిండి. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము.

లేవీయకాండము 23:14 మీరు మీ దేవునికి అర్పణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టెయేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తర తరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ.

లేవీయకాండము 23:15 మీరు విశ్రాంతిదినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని యేడు వారములు లెక్కింపవలెను; లెక్కకు తక్కువకాకుండ ఏడు వారములు ఉండవలెను.

లేవీయకాండము 23:16 ఏడవ విశ్రాంతిదినపు మరుదినమువరకు మీరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింపవలెను.

లేవీయకాండము 23:17 మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవ వంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము.

లేవీయకాండము 23:18 మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును.

లేవీయకాండము 23:19 అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాపపరిహారార్థబలిగా అర్పించి రెండు ఏడాది గొఱ్ఱపిల్లలను సమాధానబలిగా అర్పింపవలెను.

లేవీయకాండము 23:20 యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకునివగును.

లేవీయకాండము 23:21 ఆనాడే మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తర తరములకు నిత్యమైన కట్టడ.

లేవీయకాండము 23:22 మీరు మీ పంటచేను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.

లేవీయకాండము 23:23 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

లేవీయకాండము 23:24 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతిదినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను.

లేవీయకాండము 23:25 అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను.

లేవీయకాండము 23:26 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

లేవీయకాండము 23:27 ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను.

లేవీయకాండము 23:28 ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు; మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసికొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము.

లేవీయకాండము 23:29 ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.

లేవీయకాండము 23:30 ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివానిని వాని ప్రజలలో నుండకుండ నాశము చేసెదను.

లేవీయకాండము 23:31 అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ.

లేవీయకాండము 23:32 అది మీకు మహా విశ్రాంతిదినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల తొమ్మిదవనాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలమువరకు మీరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను.

లేవీయకాండము 23:33 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

లేవీయకాండము 23:34 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.

లేవీయకాండము 23:35 వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.

లేవీయకాండము 23:36 ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.

లేవీయకాండము 23:37 యెహోవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములు గాకయు, మీ మ్రొక్కుబడి దినములు గాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములు గాకయు, యెహోవాకు హోమద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యమునేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధసంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి.

లేవీయకాండము 23:38 ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసికొనిరావలెను.

లేవీయకాండము 23:39 అయితే ఏడవ నెల పదునయిదవ దినమున మీరు భూమిపంటను కూర్చుకొనగా ఏడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతిదినము, ఎనిమిదవ దినము విశ్రాంతిదినము.

లేవీయకాండము 23:40 మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజిచెట్ల కొమ్మలను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను.

లేవీయకాండము 23:41 అట్లు మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తర తరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను.

లేవీయకాండము 23:42 నేను ఐగుప్తు దేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.

లేవీయకాండము 23:43 నేను మీ దేవుడనైన యెహోవాను.

లేవీయకాండము 23:44 అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియచెప్పెను.

లేవీయకాండము 25:1 మరియు యెహోవా సీనాయి కొండమీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను

లేవీయకాండము 25:13 ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను.

సంఖ్యాకాండము 28:1 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

సంఖ్యాకాండము 29:40 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను.

రోమీయులకు 14:5 ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలెను.

కొలొస్సయులకు 2:16 కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పుతీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి.

కొలొస్సయులకు 2:17 ఇవి రాబోవు వాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది

సంఖ్యాకాండము 28:11 నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహనబలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను,

రోమీయులకు 14:6 దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు.

2కొరిందీయులకు 12:15 కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా?

గలతీయులకు 2:4 మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తుయేసువలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులవలన జరిగినది.