Logo

గలతీయులకు అధ్యాయము 4 వచనము 14

1కొరిందీయులకు 2:3 మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద నుంటిని.

2కొరిందీయులకు 10:10 అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై యున్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని యొకడు అనును.

2కొరిందీయులకు 11:6 మాటలయందు నేను నేర్పులేనివాడనైనను జ్ఞానమందు నేర్పులేనివాడను కాను. ప్రతి సంగతిలోను అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనుపరచియున్నాము.

2కొరిందీయులకు 11:30 అతిశయపడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన సంగతులనుగూర్చియే అతిశయపడుదును.

2కొరిందీయులకు 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.

2కొరిందీయులకు 12:8 అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.

2కొరిందీయులకు 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును

2కొరిందీయులకు 12:10 నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.

2కొరిందీయులకు 13:4 బలహీనతనుబట్టి ఆయన సిలువ వేయబడెను గాని, దేవుని శక్తినిబట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనయందుండి బలహీనులమైయున్నాము గాని, మీయెడల దేవుని శక్తినిబట్టి, ఆయనతో కూడ జీవము గలవారము.

గలతీయులకు 1:6 క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.

అపోస్తలులకార్యములు 16:6 ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారినాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని

లేవీయకాండము 13:40 తలవెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు; అయినను వాడు పవిత్రుడు.

మత్తయి 18:10 ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను.

అపోస్తలులకార్యములు 20:19 యూదుల కుట్రలవలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును.

2కొరిందీయులకు 4:7 అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.

గలతీయులకు 4:14 అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానినిబట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదుగాని దేవుని దూతను వలెను, క్రీస్తుయేసును వలెను నన్ను అంగీకరించితిరి

హెబ్రీయులకు 4:2 వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసియుండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్‌ప్రయోజనమైనదాయెను.

హెబ్రీయులకు 5:2 తానుకూడ బలహీనతచేత ఆవరింపబడి యున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూపగలవాడైయున్నాడు.