Logo

యెహోషువ అధ్యాయము 21 వచనము 3

ఆదికాండము 49:7 వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.

ద్వితియోపదేశాకాండము 33:8 లేవినిగూర్చి యిట్లనెను నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి.

ద్వితియోపదేశాకాండము 33:9 అతడు నేను వానినెరుగనని తన తండ్రినిగూర్చియు తన తల్లినిగూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని యెంచలేదు వారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి.

ద్వితియోపదేశాకాండము 33:10 వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు

1దినవృత్తాంతములు 6:54 అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు; వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులనుబట్టి వారికి ఏర్పడిన నివాసస్థలములు ఇవి.

1దినవృత్తాంతములు 6:55 యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుపగ్రామములును వారికప్పగింపబడెను.

1దినవృత్తాంతములు 6:56 అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను.

1దినవృత్తాంతములు 6:57 అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయపట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:58 హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:59 ఆషాను దాని గ్రామములు, బేత్షెమెషు దాని గ్రామములు.

1దినవృత్తాంతములు 6:60 మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.

1దినవృత్తాంతములు 6:61 కహాతు గోత్రీయులలో శేషించినవారికి ఎఫ్రాయిము గోత్రస్థానములోనుండియు, దాను అర్ధగోత్ర స్థానములోనుండియు, మనష్షే అర్ధగోత్ర స్థానములోనుండియు చీటిచేత పది పట్టణములు ఇయ్యబడెను.

1దినవృత్తాంతములు 6:62 గెర్షోను సంతతివారికి వారి వంశములచొప్పున ఇశ్శాఖారు గోత్రస్థానములోనుండియు, ఆషేరు గోత్రస్థానములోనుండియు, నఫ్తాలి గోత్రస్థానములోనుండియు బాషానునందుండు మనష్షే గోత్రస్థానములోనుండియు పదుమూడు పట్టణములు ఇయ్యబడెను.

1దినవృత్తాంతములు 6:63 మెరారీయులకు వారి వంశములచొప్పున రూబేను గోత్రస్థానములోనుండియు, గాదు గోత్రస్థానములోనుండియు, జెబూలూను గోత్రస్థానములోనుండియు చీటిచేత పండ్రెండు పట్టణములు ఇయ్యబడెను.

1దినవృత్తాంతములు 6:64 ఈ ప్రకారముగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి.

1దినవృత్తాంతములు 6:65 వారు చీటివేసి యూదావారి గోత్రస్థానములోనుండియు, షిమ్యోనీయుల గోత్రస్థానములోనుండియు, బెన్యామీనీయుల గోత్రస్థానములోనుండియు పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి.

1దినవృత్తాంతములు 6:66 కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను.

1దినవృత్తాంతములు 6:67 ఆశ్రయ పట్టణములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దాని గ్రామములును, గెజెరును దాని గ్రామములును,

1దినవృత్తాంతములు 6:68 యొక్మెయామును దాని గ్రామములును బేత్‌హోరోనును దాని గ్రామములును,

1దినవృత్తాంతములు 6:69 అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారికియ్యబడెను.

1దినవృత్తాంతములు 6:70 మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి.

1దినవృత్తాంతములు 6:71 మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశ స్థానములోనుండి బాషానునందలి గోలానుదాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:72 ఇశ్శాఖారు గోత్రస్థానములోనుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:73 రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:74 ఆషేరు గోత్రస్థానములోనుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:75 హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు;

1దినవృత్తాంతములు 6:76 నఫ్తాలి గోత్రస్థానములోనుండి గలిలయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను.

1దినవృత్తాంతములు 6:77 మరియు మెరారీయులలో శేషించినవారికి జెబూలూను గోత్రస్థానములోనుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:78 యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అరణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:79 కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:80 గాదు గోత్ర స్థానములోనుండి గిలాదు యందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:81 హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు, ఇయ్యబడెను.

సంఖ్యాకాండము 35:6 మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను. నరహంతుకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియు గాక నలువదిరెండు పురములను ఇయ్యవలెను.

సంఖ్యాకాండము 35:7 వాటి వాటి పల్లెలతోకూడ మీరు లేవీయులకు ఇయ్యవలసిన పురములన్నియు నలువది యెనిమిది.

సంఖ్యాకాండము 35:8 మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములోనుండియే ఇయ్యవలెను. మీరు ఎక్కువైనదానిలో ఎక్కువగాను, తక్కువైనదానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యముచొప్పున, తన తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇయ్యవలెను.

యెహోషువ 21:8 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు వంతు చీట్లవలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయుల కిచ్చిరి.