Logo

యెహోషువ అధ్యాయము 21 వచనము 27

యెహోషువ 21:6 ఇశ్శాఖారు గోత్రికులనుండియు, ఆషేరు గోత్రికులనుండియు, నఫ్తాలి గోత్రికులనుండియు, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపువారినుండియు చీట్లవలన గెర్షోనీయులకు కలిగినవి పదమూడు పట్టణములు.

యెహోషువ 20:8 తూర్పుదిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీ యుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్య ములోని బేసెరును, గాదీయుల గోత్రము లోనుండి గిలాదు లోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి.

ద్వితియోపదేశాకాండము 1:4 నలుబదియవ సంవత్సరములో పదకొండవ నెల మొదటి తేదిని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకాజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను.

ద్వితియోపదేశాకాండము 4:43 అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీయులకు గిలాదులోనున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే.

1దినవృత్తాంతములు 6:71 మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశ స్థానములోనుండి బాషానునందలి గోలానుదాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:71 మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశ స్థానములోనుండి బాషానునందలి గోలానుదాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,

సంఖ్యాకాండము 35:6 మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను. నరహంతుకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియు గాక నలువదిరెండు పురములను ఇయ్యవలెను.

1దినవృత్తాంతములు 6:62 గెర్షోను సంతతివారికి వారి వంశములచొప్పున ఇశ్శాఖారు గోత్రస్థానములోనుండియు, ఆషేరు గోత్రస్థానములోనుండియు, నఫ్తాలి గోత్రస్థానములోనుండియు బాషానునందుండు మనష్షే గోత్రస్థానములోనుండియు పదుమూడు పట్టణములు ఇయ్యబడెను.