Logo

యెహోషువ అధ్యాయము 22 వచనము 3

ఫిలిప్పీయులకు 1:23 ఈ రెంటి మధ్యను ఇరుకున బడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు.

ఫిలిప్పీయులకు 1:24 అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది.

ఫిలిప్పీయులకు 1:25 మరియు ఇట్టి నమ్మకము కలిగి, నేను మరల మీతో కలిసియుండుటచేత నన్నుగూర్చి క్రీస్తుయేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు.

ఫిలిప్పీయులకు 1:26 మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితో కూడ కలిసియుందునని నాకు తెలియును.

ఫిలిప్పీయులకు 1:27 నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏకమనస్సు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మునుగూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.

సంఖ్యాకాండము 9:23 యెహోవా మాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి; యెహోవా మాటచొప్పున వారు ప్రయాణముచేసిరి; మోషేద్వారా యెహోవా చెప్పిన మాటనుబట్టి యెహోవా ఆజ్ఞననుసరించి నడిచిరి.