Logo

యెహోషువ అధ్యాయము 22 వచనము 4

యెహోషువ 21:43 యెహోవా ప్రమాణము చేసి వారి పితరుల కిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయుల కప్పగించెను. వారు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి.

యెహోషువ 21:44 యెహోవా వారి పితరులతో ప్రమాణముచేసిన వాటన్నిటి ప్రకారము అన్నిదిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరిని వారిచేతి కప్పగించియుండెను గనుక వారిలోనొకడును ఇశ్రాయేలీయులయెదుట నిలువ లేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను.

ద్వితియోపదేశాకాండము 12:9 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు.

యెహోషువ 13:8 రూబేనీయులు గాదీయులు తూర్పుదిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి.

యెహోషువ 13:15 వారి వంశములనుబట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్య మిచ్చెను.

యెహోషువ 13:16 వారి సరిహద్దు ఏదనగా, అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణమునుండి మేదెబాయొద్దనున్న మైదానమంతయు

యెహోషువ 13:17 హెష్బోనును మైదానములోని పట్టణములన్నియు, దీబోను బామోత్బయలు బేత్బయల్మెయోను

యెహోషువ 13:18 యాహసు కెదేమోతు మేఫాతు

యెహోషువ 13:19 కిర్యతాయిము సిబ్మాలోయలోని కొండమీది శెరెత్షహరు బెత్పయోరు పిస్గాకొండచరియలు

యెహోషువ 13:20 బెత్యేషి మోతు అను పట్టణములును మైదానములోని పట్టణము లన్నియు, హెష్బోనులో ఏలికయు,

యెహోషువ 13:21 మోషే జయించిన వాడునైన సీహోను వశముననున్న ఎవీ రేకెము సూరు హోరు రేబ అను మిద్యానురాజుల దేశమును అమోరీ యుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్య ముగా ఇచ్చెను.

యెహోషువ 13:22 ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడు నైన బిలామును తాము చంపిన తక్కినవారితో పాటు ఖడ్గముతో చంపిరి.

యెహోషువ 13:23 యొర్దాను ప్రదేశమంతయు రూబేనీ యులకు సరిహద్దు; అదియు దానిలోని పట్టణములును గ్రామములును రూబేనీయుల వంశముల లెక్కచొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము.

యెహోషువ 13:24 మోషే గాదుగోత్రమునకు, అనగా గాదీయులకు వారి వంశములచొప్పున స్వాస్థ్యమిచ్చెను.వారి సరి

యెహోషువ 13:25 హద్దు యాజెరును గిలాదు పట్టణములన్నియు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరువరకు అమ్మోనీయుల దేశములో సగమును

యెహోషువ 13:26 హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొ నీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరి హద్దువరకును

యెహోషువ 13:27 లోయలో బేతారాము బేత్నిమ్రా సుక్కోతు సాపోను, అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నె రెతు సముద్రతీరమువరకునున్న యొర్దాను ప్రదేశమును.

యెహోషువ 13:28 వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్ట ణములును గ్రామములును ఇవి.

యెహోషువ 13:29 మోషే మనష్షే అర్థగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశములచొప్పున మనష్షీయుల అర్థగోత్రమునకు స్వాస్థ్యము.

యెహోషువ 13:30 వారి సరిహద్దు మహనయీము మొదలు కొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వ రాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని అరువది పట్టణములును.

యెహోషువ 13:31 గిలాదులో సగ మును, అష్తారోతు ఎద్రయియునను బాషానులో ఓగు రాజ్య పట్టణములును మనష్షే కుమారుడైన మాకీరు, అనగా మాకీరీయులలో సగముమందికి వారి వంశములచొప్పున కలిగినవి.

యెహోషువ 13:32 యెరికోయొద్ద తూర్పుదిక్కున యొర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచి పెట్టిన స్వాస్థ్యములు ఇవి.

యెహోషువ 13:33 లేవీ గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు; ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము.

యెహోషువ 14:1 ఇశ్రాయేలీయులు కనానుదేశమున పొందిన స్వాస్థ్య ములు ఇవి.

యెహోషువ 14:2 మోషేద్వారా యెహోవా ఆజ్ఞాపించి నట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులును చీట్లు వేసి, తొమ్మిది గోత్రములవారికిని అర్ధగోత్రపువారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి.

యెహోషువ 14:3 మోషే రెండు గోత్రములకును అర్ధగోత్ర మునకును యొర్దాను అవతలి స్వాస్థ్యముల నిచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు

యెహోషువ 14:4 యోసేపు వంశకులగు మనష్షే ఎఫ్రాయిములను రెండు గోత్రములవారు నివసించుటకు పట్టణములును వారి పశు వులకును వారి మందలకును పట్టణముల సమీపభూములను మాత్రమేకాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు.

యెహోషువ 14:5 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి.

సంఖ్యాకాండము 32:33 అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంతపురములతో ఆ దేశమును చట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను.

సంఖ్యాకాండము 32:34 గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను

సంఖ్యాకాండము 32:35 యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను

సంఖ్యాకాండము 32:36 అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి.

సంఖ్యాకాండము 32:37 రూబేనీయులు మారుపేరుపొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను

సంఖ్యాకాండము 32:38 షిబ్మా అను పురములను కట్టి, తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి.

సంఖ్యాకాండము 32:39 మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదుమీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్లగొట్టిరి.

సంఖ్యాకాండము 32:40 మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను

సంఖ్యాకాండము 32:41 అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను.

సంఖ్యాకాండము 32:42 నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను.

ద్వితియోపదేశాకాండము 3:1 మనము తిరిగి బాషాను మార్గమున వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరును ఎద్రెయీలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి యెదురుగా రాగా

ద్వితియోపదేశాకాండము 3:2 యెహోవా నాతో ఇట్లనెను అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీచేతికి అప్పగించియున్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలెనని చెప్పెను.

ద్వితియోపదేశాకాండము 3:3 అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మనచేతికి అప్పగించెను; అతనికి శేషమేమియు లేకుండ అతనిని హతము చేసితివిు.

ద్వితియోపదేశాకాండము 3:4 ఆ కాలమున అతని పురములన్నిటిని పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురమొకటియు లేదు. బాషానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటనున్న అరువది పురములను పట్టుకొంటిమి.

ద్వితియోపదేశాకాండము 3:5 ఆ పురములన్నియు గొప్ప ప్రాకారములు గవునులు గడియలును గల దుర్గములు. అవియు గాక ప్రాకారములేని పురములనేకములను పట్టుకొంటిమి.

ద్వితియోపదేశాకాండము 3:6 మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితివిు; ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితివిు;

ద్వితియోపదేశాకాండము 3:7 వారి పశువులనన్నిటిని ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసికొంటిమి.

ద్వితియోపదేశాకాండము 3:8 ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండవరకు యొర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల యిద్దరు రాజులయొద్దనుండి పట్టుకొంటిమి.

ద్వితియోపదేశాకాండము 3:9 సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమోరీయులు దానిని శెనీరని అందురు.

ద్వితియోపదేశాకాండము 3:10 మైదానమందలి పురములన్నిటిని బాషానునందలి ఓగు రాజ్య పురములైన సల్కా ఎద్రెయీ అనువాటివరకు గిలాదంతటిని బాషానును పట్టుకొంటిమి.

ద్వితియోపదేశాకాండము 3:11 రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా? దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు.

ద్వితియోపదేశాకాండము 3:12 అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్నెములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశమును, దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని.

ద్వితియోపదేశాకాండము 3:13 ఓగు రాజు దేశమైన బాషాను యావత్తును గిలాదులో మిగిలినదానిని, అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంతటిని మనష్షే అర్ధగోత్రమునకిచ్చితిని.

ద్వితియోపదేశాకాండము 3:14 మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయాకాతీయుయొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి.

ద్వితియోపదేశాకాండము 3:15 మాకీరీయులకు గిలాదునిచ్చితిని.

ద్వితియోపదేశాకాండము 3:16 గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్యవరకును, యబ్బోకు నదివరకును అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును

ద్వితియోపదేశాకాండము 3:17 కిన్నెరెతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండచరియల దిగువగా, ఉప్పు సముద్రము అనబడివ అరాబా సముద్రమువరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని.

ద్వితియోపదేశాకాండము 29:8 మనము వారిని హతముచేసి వారి దేశమును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపువారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితివిు.

నిర్గమకాండము 33:14 అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా

సంఖ్యాకాండము 32:18 ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా యిండ్లకు తిరిగిరాము.

సంఖ్యాకాండము 32:22 ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగివచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులైయుందురు; అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును.

ద్వితియోపదేశాకాండము 1:1 యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే.

ద్వితియోపదేశాకాండము 3:20 అనగా మీ దేవుడైన యెహోవా యొర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకొనువరకు, మీ భార్యలును మీ పిల్లలును మీ మందలును నేను మీకిచ్చిన పురములలో నివసింపవలెను. తరువాత మీలో ప్రతివాడును నేను మీకిచ్చిన తన తన స్వాస్థ్యమునకు తిరిగిరావలెనని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియును.

ద్వితియోపదేశాకాండము 33:21 అతడు తనకొరకు మొదటిభాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడ వచ్చెను యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇశ్రాయేలీయులయొద్ద యెహోవా విధులను ఆచరించెను.

యెహోషువ 1:15 నది దాటి, యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకొనువరకు మీరును సహాయము చేయ వలెను. అప్పుడు తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరచుకొందురు.

యెహోషువ 9:1 యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారి రాజులందరు జరిగినదానిని వినినప్పుడు

యెహోషువ 11:23 యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశ మంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని నప్ప గించెను. అప్పుడు యుద్ధములేకుండ దేశము సుభిక్షముగా నుండెను.

యెహోషువ 12:1 ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల నున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా

యెహోషువ 23:1 చుట్టునున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండ యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగ జేసినమీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములుగల వృద్ధుడాయెను.

1దినవృత్తాంతములు 22:18 ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీతోకూడ ఉన్నాడు గదా? చుట్టునున్న వారివలన తొందరలేకుండ ఆయన మీకు నెమ్మది యిచ్చియున్నాడు గదా? దేశనివాసులను ఆయన నాకు వశపరచియున్నాడు, యెహోవా భయమువలనను ఆయన జనుల భయమువలనను దేశము లోపరచబడియున్నది.

యెషయా 63:14 పల్లమునకు దిగు పశువులు విశ్రాంతినొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి

హెబ్రీయులకు 4:8 యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమునుగూర్చి ఆయన చెప్పకపోవును.